గ్రహం అనుగ్రహం(18-10-2019)

18 Oct, 2019 05:55 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి బ.పంచమి తె.5.05 వరకు (తెల్లవారితే శనివారం), నక్షత్రం రోహిణి ప.3.45 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం ఉ.7.30 నుంచి 9.10 వరకు, తదుపరి రా.9.20 నుంచి 10.56 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.04 వరకు, తదుపరి ప.12.09 నుంచి 12.55 వరకు అమృతఘడియలు... ప.12.01 నుంచి 2.01 వరకు.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం    :  5.34
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: కుటుంబసభ్యులతో  వివాదాలు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

వృషభం: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి.

మిథునం: పనులు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశాజనకమే. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పోటీపరీక్షలలో విజయం. వాహనయోగం. కొత్త వ్యాపారాలకు శ్రీకారం. ఉద్యోగోన్నతి.

సింహం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

కన్య: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు.

తుల: వ్యయప్రయాసలు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు. దైవదర్శనాలు.

వృశ్చికం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

ధనుస్సు: కొత్త ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

మకరం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. బంధుమిత్రులతో విభేదాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: శ్రమ పెరుగుతుంది. పనులలో అవాంతరాలు. బంధువులతో వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో చికాకులు.

మీనం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు