గ్రహం అనుగ్రహం (18-12-2019)

18 Dec, 2019 06:23 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి బ.సప్తమి రా.12.32వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం పుబ్బ రా.1.32 వరకుతదుపరి, ఉత్తర, వర్జ్యం ఉ.10.36 నుంచి 12.05 వరకుదుర్ముహూర్తం ప.11.33 నుంచి 12.16 వరకుఅమృతఘడియలు... రా.7.33 నుంచి 9.01 వరకు.

సూర్యోదయం :    6.27
సూర్యాస్తమయం    :  5.25
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

వృషభం: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం: ఆసక్తికర సమాచారం. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకం: శ్రమ అంతగా ఫలించదు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి.

కన్య: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. పనులు మందగిస్తాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
తుల: ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. పనులలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం: కొన్ని వివాదాలు పరిష్కారవుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. దైవచింతన. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం: కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

కుంభం: పోటీపరీక్షల్లో విజయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మీనం: పలుకుబ  కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు