గ్రహం అనుగ్రహం (19-01-2020)

19 Jan, 2020 05:30 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి బ.నవమి ఉ.7.04 వరకు, తదుపరి దశమి తె.5.16 వరకు (తెల్లవారితే సోమవారం) నక్షత్రం విశాఖ రా.2.24 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం ఉ.9.01 నుంచి 10.30 వరకు, దుర్ముహూర్తం సా.4.13 నుంచి 4.57 వరకు, అమృతఘడియలు... సా.6.04 నుంచి 7.34 వరకు.

సూర్యోదయం        :  6.38
సూర్యాస్తమయం    :  5.43
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం: బంధువులతో సఖ్యత. విందువినోదాలు. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగులకు కొన్ని చికాకులు తొలగుతాయి. 
వృషభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు అనుకోని విధంగా పదోన్నతులు.
మిథునం: కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు కొంత శ్రమ తప్పదు.
కర్కాటకం:  ప్రయాణాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. బంధువర్గంతో  తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
సింహం: బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. 
కన్య: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో నిరుత్సాహం. 
తుల: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. సోదరుల నుంచి సహాయం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. 
వృశ్చికం: అనుకోని ప్రయాణాలు. బం«ధువులు, మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. 
ధనుస్సు: బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వాహన, గృహయోగాలు. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మకరం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఉద్యోగయత్నాలలో అనుకూలత. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. 
కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. మానసిక అశాంతి. అనారోగ్యం. పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో  మార్పులు ఉండవచ్చు. 
మీనం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. 
– సింహంభట్ల సుబ్బారావు 

మరిన్ని వార్తలు