గ్రహం అనుగ్రహం (19-10-2019)

19 Oct, 2019 06:54 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి బ.షష్ఠి తె.4.04 వరకు (తెల్లవారితే ఆదివారం), నక్షత్రం మృగశిర ప.3.45 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం రా.12.05 నుంచి 1.40 వరకు దుర్ముహూర్తం ఉ.6.44 నుంచి 7.29 వరకుఅమృతఘడియలు... ఉ.6.54 నుంచి 8.30 వరకు.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం    :  5.34
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు.  వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృషభం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని  చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో సమస్యలు. దైవదర్శనాలు.

మిథునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. దైవదర్శనాలు.  వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కర్కాటకం: పనుల్లో కొద్దిపాటి అవాంతరాలు. ధవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

సింహం: నూతన  పరిచయాలు. బంధువుల నుంచి ఆసక్తికర మైన సమాచారం. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి.  వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. భూలాభాలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: పనుల్లో కొన్ని అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులలో ప్రతిబంధకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో మరింత గౌరవం. కీలక నిర్ణయాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మకరం: కొత్త పనులు చేపడతారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు దక్కే ఛాన్స్‌.

కుంభం: వ్యవహారాలలో నిరుత్సాహం. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో నిరాశ.

మీనం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా