గ్రహం అనుగ్రహం (19-12-2019)

19 Dec, 2019 06:08 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం, తిథి బ.అష్టమి రా.10.11 వరకు తదుపరి నవమి నక్షత్రం ఉత్తర రా.10.51 వరకు, తదుపరి, హస్త, వర్జ్యం ఉ.8.14
నుంచి 9.43 వరకు, దుర్ముహూర్తం ఉ.10.07 నుంచి 10.50వరకు, తదుపరి ప.2.29 నుంచి, 3.13 వరకు, అమృతఘడియలు... సా.5.02 నుంచి 6.44 వరకు.

సూర్యోదయం :    6.27
సూర్యాస్తమయం    :  5.25
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో మరింత ఆదరణ. వస్తు, వస్త్రలాభాలు. నూతన ఉద్యోగప్రాప్తి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వృషభం: సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిథునం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటకం: మిత్రులు, బంధువులతో సఖ్యత. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.

కన్య: శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

తుల: చేపట్టిన పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయా లు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

వృశ్చికం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు: కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మకరం: వ్యవహారాలలో చికాకులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

కుంభం: మిత్రులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. శ్రమకు ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనయోగం. ఉద్యోగయత్నాలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు