గ్రహం అనుగ్రహం (20-01-2020)

20 Jan, 2020 05:11 IST|Sakshi

శ్రీవికారినామ సంవత్సరం. ఉత్తరాయణం, హేమంత ఋతువు. పుష్య మాసం. తిథి బ.ఏకాదశి రా.3.55 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం అనూరాధ రా.1.36 వరకు, తదుపరి జ్యేష్ఠ. వర్జ్యం ఉ.7.05 నుంచి 8.39 వరకు. దుర్ముహూర్తం ప.12.32 నుంచి 1.16 వరకు, తదుపరి ప.2.45 నుంచి 3.29 వరకు. అమృత ఘడియలు ప.3.32 నుంచి 5.04 వరకు

సూర్యోదయం: 6.38 సూర్యాస్తమయం : 5.44
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

నమాజ్‌ వేళలు
ఫజర్‌ : 5.34  జొహర్‌ : 12.27  
అసర్‌ : 4.28  మగ్రీబ్: 6.04 
ఇషా : 7.20

భవిష్యం
మేషం: వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.
వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
మిథునం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థికాభివృద్ధి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాల నిర్వహణ. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.
కర్కాటకం: సోదరులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందికరంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.
సింహం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో బాధ్యతలు తప్పవు.
కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.
తుల: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. పనులలో అవాంతరాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.
వృశ్చికం: పరిచయాలు విస్తృతమవుతాయి. వాహనాలు కొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
ధనుస్సు: కొత్త రుణాలు చేయాల్సినవస్తుంది. స్వల్ప అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
మకరం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
కుంభం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.
మీనం: వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిళ్లు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
– సింహంభట్ల సుబ్బారావు 

మరిన్ని వార్తలు