గ్రహం అనుగ్రహం (21-09-2019)

21 Sep, 2019 06:37 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి బ.సప్తమి ప.3.27 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం రోహిణి ఉ.8.10 వరకు, తదుపరి మృగశిర వర్జ్యం ప.1.44 నుంచి 3.20 వరకు, దుర్ముహూర్తం ఉ.5.53 నుంచి 7.28 వరకు, అమృతఘడియలు... ఉ.4.55 నుంచి 6.54 వరకు, తిరిగి రా.11.20 నుంచి 12.55 వరకు.

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  5.56
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: పనుల్లో అవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం:  రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సన్మానయోగం. ఆధ్యాత్మిక చింతన.  వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

మిథునం: ఆదాయానికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. అనుకోని ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తులాభాలు.

సింహం: ఉద్యోగయత్నాలలో అనుకూలత. వేడుకల్లో పాల్గొంటారు. వస్తులాభాలు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొన్ని  మార్పులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

తుల: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సందేశం. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు లభించవచ్చు.

ధనుస్సు: ఆకస్మిక ధనలబ్ధి. పనుల్లో విజయం. బంధువుల నుంచి  విలువైన సమాచారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మకరం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు కొంత సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

కుంభం: మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో గందరగోళం.

మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు.  అనుకున్న పనులలో విజయం. శుభవార్తలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. వాహనయోగం.– సింహంభట్ల సుబ్బారావు
 

మరిన్ని వార్తలు