గ్రహం అనుగ్రహం (22-06-2020)

22 Jun, 2020 06:20 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఆషాఢ మాసం. తిథి శు.పాడ్యమి ఉ.11.44 వరకు, తదుపరి విదియ. నక్షత్రం ఆరుద్ర ప.1.47 వరకు, తదుపరి పునర్వసు. వర్జ్యం రా.1.54 నుంచి 3.31 వరకు. దుర్ముహూర్తం ప.12.26 నుంచి 1.20 వరకు, తదుపరి ప.3.04 నుంచి 3.55 వరకు. అమృతఘడియలు లేవుసూర్యోదయం: 5.30 సూర్యాస్తమయం: 6.32; రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు. యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

గ్రహఫలం
మేషం: ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దూరప్రయాణాలు. మిత్రులతో విభేదాలు.  ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం..ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. రాబడి ఆశించిన మేరకు సమకూరుతుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.

మిథునం: దూరప్రయాణాలు. శ్రమకు ఫలితం అంతగా కనిపించదు. సన్నిహితులతో విభేదాలు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.

కర్కాటకం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

సింహం: వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. బంధువుల నుంచి విమర్శలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఊహలు నిజం చేసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రాబడి పెరుగుతుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు విస్తరిస్తారు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: ఆర్థిక  ఇబ్బందులు, రుణయత్నాలు. పనులలో  ఆటంకాలు.  ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితులు, మిత్రులతో విభేధాలు వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పైస్థాయి నుంచి ఒత్తిడులు.

ధనుస్సు: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులతో విభేదాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో  వివాదాలు..

మకరం: పరపతి పెరుగుతుంది. బంధువులు, మిత్రులతో సఖ్యత. కాంట్రాక్టులు చేపడతారు. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుంభం:చిరకాల కోరిక నెరవేరుతుంది. మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి..

మీనం: అనుకోని ప్రయాణాలు. మిత్రుల నుంచి విమర్శలు. కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. ఆరోగ్య సమస్యలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు