గ్రహం అనుగ్రహం (22-10-2019)

22 Oct, 2019 06:17 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి బ.నవమి రా.11.17 వరకు, తదుపరి దశమి, నక్షత్రం పుష్యమి ప.1.36 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం రా.1.42, నుంచి 3.12 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.02 వరకు, తదుపరి రా.10.31 నుంచి 11.19 వరకు అమృతఘడియలు... ఉ.10.45 నుంచి 12.16 వరకు.

సూర్యోదయం :    5.58
సూర్యాస్తమయం    :  5.32
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: పనుల్లో తొందరపాటు వద్దు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు.

వృషభం: అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

మిథునం: మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత వ్యతిరేక పరిస్థితులు.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు.

సింహం: కొన్ని ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. ఆలయ దర్శనాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు పనిభారం.

కన్య: ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. పనుల్లో విజయం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

తుల: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

వృశ్చికం: మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. శ్రమ కొంత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.

ధనుస్సు: మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో మరింత ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మకరం: కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఊహించని ధనలబ్ధి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కుంభం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మీనం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ప్రముఖుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి ఉంటుంది.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు