గ్రహం అనుగ్రహం (22-12-2019)

22 Dec, 2019 06:27 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరందక్షిణాయనం, హేమంత ఋతువుమార్గశిర మాసం, తిథి బ.ఏకాదశి ప.3.36 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం స్వాతి రా.7.24 వరకు, తదుపరి విశాఖవర్జ్యం రా.12.43 నుంచి 2.14 వరకుదుర్ముహూర్తం సా.3.58 నుంచి 4.44 వరకు, అమృతఘడియలు... ప.11.03నుంచి 12.34 వరకు.

సూర్యోదయం        :  6.30
సూర్యాస్తమయం    :  5.27
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. పారిశ్రామికవేత్తల ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం: నూతన పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలలో విజయం. దైవదర్శనాలు చేసుకుంటారు.  శుభవార్తలు.  ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. కళాకారులకు ఒడిదుడుకులు.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. పారిశ్రామికవేత్తల అంచనాలు తప్పుతాయి.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. కళాకారులకు నూతనోత్సాహం.

కన్య: బాధ్యతలు పెరుగుతాయి. ఇంటాబయటా చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. కళాకారులకు ఒడిదుడుకులు.

తుల: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం.

వృశ్చికం: బంధువిరోధాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు నిరాశ.

ధనుస్సు: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి

మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవేత్తలకు ఆశాజనకంగా ఉంటుంది.

కుంభం: వ్యయప్రయాసలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు.

మీనం: మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.  చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. నిరుద్యోగులకు నిరుత్సాహం.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు