గ్రహం అనుగ్రహం (24-01-2020)

24 Jan, 2020 05:34 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువుపుష్య మాసం, తిథి అమావాస్య రా.2.24 వరకు, తదుపరి, మాఘ శు.పాడ్యమి, నక్షత్రం ఉత్తరాషాఢ రా.2.25 వరకు, తదుపరి శ్రవణం వర్జ్యం ఉ.9.49 నుంచి 11.29 వరకు, దుర్ముహూర్తం ఉ.8.50నుంచి 9.35 వరకు, తదుపరి ప.12.33 నుంచి 1.19 వరకు అమృతఘడియలు... రా.7.46 నుంచి 9.26 వరకు.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.46
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు. వ్యాపారవృద్ధి. దైవదర్శనాలు. వస్తు, వస్త్రలాభాలు.

వృషభం: అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు. ఆలయ దర్శనాలు. పనులు మందగిస్తాయి.

మిథునం: ప్రయాణాలు చివరిలో వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. కుటుంబంలో ఒత్తిడులు. బ«ంధువుల కలయిక. వ్యాపారాలు అంతగా కలసిరావు. ఉద్యోగమార్పులు.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. ఆస్తి లాభం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి ఉపశమనం.

సింహం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. కీలక నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కన్య: కొన్ని పనులు ఎట్టకేలకు పూర్తి. దూరప్రయాణాలు. ఖర్చులు అధికం. మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

తుల: ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. మిత్రులతో  విభేదాలు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి.

వృశ్చికం:  విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: కుటుంబంలో స్వల్ప చికాకులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో గందరగోళం.

మకరం:  ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం. సన్నిహితుల నుంచి శుభవార్తలు. బంధువుల నుంచి ఆస్తి లాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కుంభం: వ్యయప్రయాసలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. ధన వ్యయం.

మీనం: నిరుద్యోగులకు కీలక సమాచారం. విందువినోదాలు. ఆకస్మిక ధనలబ్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు విస్తరిస్తారు.  ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. శుభవార్తలు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు