గ్రహం అనుగ్రహం (24-11-2019)

24 Nov, 2019 05:59 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ. త్రయోదశి రా.12.16 వరకు, తదుపరి చతుర్దశి నక్షత్రం చిత్త ప.12.27 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం సా.5.44, నుంచి 7.14 వరకు, దుర్ముహూర్తం సా.3.52 నుంచి 4.34 వరకు, అమృతఘడియలు... ఉ.6.28 నుంచి 7.56 వరకు.

సూర్యోదయం        :  6.12
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

భవిష్యం
మేషం: ఆర్థిక పరిస్థితిలో  ఇబ్బందులు తొలగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అవరోధాలు అధిగమిస్తారు.
వృషభం: అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలకు అనుకూల సమయం. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభించవచ్చు.
మిథునం: సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆధ్యాత్మిక చింతన . అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
కన్య: రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.
తుల: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. చిత్రమైన సంఘటనలు. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు గతం కంటే లాభిస్తాయి. ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది.
వృశ్చికం: బంధువర్గంతో మాటపట్టింపులు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యసమస్యలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
ధనుస్సు: కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. స్థిరాస్తి వృద్ధి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మకరం: రుణబాధలు తొలగుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. వాహనయోగం. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
కుంభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఒత్తిడులు.
మీనం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
– సింహంభట్ల సుబ్బారావు 

మరిన్ని వార్తలు