గ్రహం అనుగ్రహం (26-10-2019)

26 Oct, 2019 05:57 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువుఆశ్వయుజ మాసం, తిథి బ.త్రయోదశి ప.2.07 వరకుతదుపరి చతుర్దశి, నక్షత్రం ఉత్తర ఉ.7.28 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ప.3.16 నుంచి 4.44 వరకు, దుర్ముహూర్తం 5.59 నుంచి 7.31 వరకు, అమృతఘడియలు.. రా.12.12 నుంచి 1.44 వరకు, నరక చతుర్దశి.

సూర్యోదయం :    6.00
సూర్యాస్తమయం    :  5.30
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు తొలగుతాయి. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

వృషభం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం.  వ్యాపార, ఉద్యోగాలు  నిరాశాజనకంగా ఉంటాయి. దైవచింతన.

మిథునం: పనులు నెమ్మదిస్తాయి. దూరప్రయాణాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిళ్లు.

కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. సోదరుల నుంచి కీలక సమాచారం. ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి.

సింహం: శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. దైవదర్శనాలు.

కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. కుటుంబసభ్యుల నుంచి కొద్దిపాటి ఇబ్బందులు.  ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు.  అనారోగ్యం.  వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళం. ధనవ్యయం.

వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. విలువైన సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో  సమస్యలు తీరతాయి.

ధనుస్సు: కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి. పనులలో విజయం. బంధువర్గం నుంచి  శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు.

మకరం: రుణఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో స్వల్ప వివాదాలు. వ్యాపారాలలో నిరుత్సాహం.  ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. 

కుంభం: కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. పనులు శ్రమానంతరం పూర్తి. ఆరోగ్యభంగం. విద్యార్థులకు శ్రమ తప్పదు.  వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మీనం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు