గ్రహం అనుగ్రహం (27-01-2020)

27 Jan, 2020 05:50 IST|Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు. మాఘ మాసం. తిథి శు.తదియ పూర్తి(24గంటలు). నక్షత్రం శతభిషం పూర్తి(24గంటలు). వర్జ్యం ప.1.34 నుంచి 3.21 వరకు. దుర్ముహూర్తం ప.12.34 నుంచి 1.19 వరకు, తదుపరి ప.2.51 నుంచి 3.35 వరకు.

అమృత ఘడియలు రా.12.03 నుంచి 1.47 వరకు
సూర్యోదయం: 6.38 సూర్యాస్తమయం : 5.49;
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: సన్నిహితుల నుంచి ధనసాయం అందుతుంది. వ్యవహార విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఉద్యోగాలు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు  ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో విశేష  గౌరవం. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కన్య: చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సజావుగా సాగుతాయి.

తుల: కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యభంగం.  వ్యాపారాలు, ఉద్యోగాలు  మందగిస్తాయి. ఇంటాబయటా చికాకులు.

వృశ్చికం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు.

ధనుస్సు: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ,  వ్యాపారాలలో పురోగతి. విద్యార్థులకు శుభవార్తలు.

మకరం: రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కుంభం: పలుకుబడి పెరుగుతుంది. పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మీనం: దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు