శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుశ్రావణ మాసం, తిథి బ.ఏకాదశి రా.12.44 వరకు,తదుపరి ద్వాదశినక్షత్రం ఆరుద్ర రా.11.48 వరకు,తదుపరి పునర్వసువర్జ్యం ఉ.8.32 నుంచి 10.06 వరకు, దుర్ముహూర్తం ప.12.26 నుంచి 1.16 వరకు, తదుపరి ప.2.56 నుంచి 3.46 వరకుఅమృతఘడియలు..ప.2.00 నుంచి 3.45 వరకు.
సూర్యోదయం : 5.48
సూర్యాస్తమయం : 6.17
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
భవిష్యం
మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. నూతన ఉద్యోగాలు పొందుతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృషభం: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొంత నిరాశ.
మిథునం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు తీరతాయి. సంఘంలో ఆదరణ. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.
సింహం: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
కన్య: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వస్తు,వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.
తుల:రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలలో కొంత నిరుత్సాహం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలలో ఇబ్బందులు. ఉద్యోగాలలో పనిభారం.
ధనుస్సు:కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూలత.
మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
కుంభం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు.
మీనం: వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో తొందరపాటు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.– సింహంభట్ల సుబ్బారావు