గ్రహం అనుగ్రహం (28-09-2019)

28 Sep, 2019 06:54 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువుభాద్రపద మాసం, తిథి అమావాస్య రా.12.28 వరకు, తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి, నక్షత్రం ఉత్తర రా.11.24 వరకు, తదుపరి హస్త, వర్జ్యం ఉ.7.46 నుంచి 9.15 వరకు దుర్ముహూర్తం ఉ.5.52 నుంచి 7.27 వరకు, అమృతఘడియలు... సా.4.44 నుంచి 5.52 వరకు, మహాలయ అమావాస్య.

సూర్యోదయం :    5.53
సూర్యాస్తమయం    :  5.50
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

వృషభం: బంధువర్గంతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. పనులు నత్తనడకన   సాగుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మిథునం: శ్రమాధిక్యం. పనులలో ఆటంకాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం: నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. విద్యావకాశాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలం.

సింహం: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.

కన్య: అనుకున్న వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

తుల: రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యయప్రయాసలు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. పనుల్లో ఆటంకాలు.

వృశ్చికం: దూరపు బంధువులను కలుసుకుంటారు. పనులలో విజయం సాధిస్తారు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

ధనుస్సు: శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మకరం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలు ముందుకు సాగవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో గందరగో పరిస్థితి.

కుంభం: ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగాలలో ప్రమోషన్లు.

మీనం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు