గ్రహం అనుగ్రహం (28-11-2019)

28 Nov, 2019 05:36 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతఋతువు, మార్గశిర మాసం, తిథి శు.విదియ రా.7.03 వరకు తదుపరి తదియ, నక్షత్రం జ్యేష్ఠ ఉ.9.05 వరకు, తదుపరి మూల వర్జ్యం సా.5.09 నుంచి 6.46 వరకు, దుర్ముహూర్తం ఉ.9.56 నుంచి 10.40 వరకు, తదుపరి ప.2.50 నుంచి 4.25 వరకు అమృతఘడియలు... రా.2.50 నుంచి 4.23 వరకు.

సూర్యోదయం :    6.16
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: రుణాలు చేస్తారు. కొన్ని పను లు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు.

వృషభం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు.  చిన్ననాటì  మిత్రుల నుంచి ఆహ్వానాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులకు సన్మానాలు.

మిథునం: ఇంటర్వ్యూలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. సోదరులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి. వాహన, గృహయోగాలు. 

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొన్ని పనులలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. 

సింహం: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. కొన్ని పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు.

కన్య: శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. వాహనాలు కొంటారు.

తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. బంధువర్గంతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు. శ్రమాధిక్యం.

వృశ్చికం: కార్యజయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. 

ధనుస్సు: కొన్ని పనులు వాయిదా పడతాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు స్వల్ప మార్పులు. మిత్రుల నుంచి ఒత్తిడులు.

మకరం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కార్యజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం. 

కుంభం: విలువైన వస్తువులు కొంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అరుదైన సన్మానాలు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

మీనం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. బంధుగణంతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. దైవదర్శనాలు.

– సింహంభట్ల సుబ్బారావు 

>
మరిన్ని వార్తలు