గ్రహం అనుగ్రహం (30-04-2020)

30 Apr, 2020 06:09 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.సప్తమి ఉ.10.04 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం పుష్యమి రా.9.35 వరకు, తదుపరి ఆశ్లేష వర్జ్యం ఉ.5.55 నుంచి 7.31 వరకు, దుర్ముహూర్తం ఉ.9.51 నుంచి 10.42 వరకు, తదుపరి ప.2.53 నుంచి 3.44 వరకు అమృతఘడియలు... ప.3.20 నుంచి 4.55 వరకు.

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.14
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

గ్రహఫలం
మేషం: పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగమార్పులు.

వృషభం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుపడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వృత్తి,వ్యాపారాలలో పురోగతి.

మిథునం:మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం:రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. దూరపు బంధువుల నుంచి ఆసక్తికర సమాచారం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

తుల:కొత్త వ్యక్తుల  పరిచయం. శుభవార్తలు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు.

వృశ్చికం:రాబడికి మించి ఖర్చులు. కుటుంబంలో సమస్యలు.  ఆకస్మిక ప్రయాణాలు.  ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు:వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. అప్రయత్న కార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం:ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో సఖ్యత. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం: శ్రమ òపెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

>
మరిన్ని వార్తలు