గ్రహం అనుగ్రహం (31-05-2020)

31 May, 2020 09:07 IST|Sakshi

శ్రీశార్వరినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి శు.నవమి ప.2.52 వరకు, తదుపరి దశమి, నక్షత్రం ఉత్తర రా.12.46 వరకు, తదుపరి హస్త, 
వర్జ్యం ఉ.9.05 నుంచి 10.34 వరకు, దుర్ముహూర్తం సా.4.41 నుంచి 5.32 వరకు, అమృతఘడియలు....సా.6.05 నుంచి 7.33 వరకు. 

సూర్యోదయం: 5.28 
సూర్యాస్తమయం: 6.26
రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు,

మేషం: పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: పనులలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కర్కాటకం: సన్నిహితులు, శ్రేయోభిలాషులతో సఖ్యత. పనులలో విజయం. శుభవార్తలు వింటారు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కన్య: సోదరుల నుంచి ధనలాభం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి.

తుల: వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. 

వృశ్చికం: కొత్త పరిచయాలు. బంధువుల నుంచి శుభవార్తలు. మిత్రులతో వివాదాలు పరిష్కారం. ఆసక్తికర సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.

ధనుస్సు: నూతన ఉద్యోగయత్నాలు సఫలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి.

మకరం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొద్దిపాటి సమస్యలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కుంభం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.

మరిన్ని వార్తలు