గ్రహం అనుగ్రహం (06-01-2020)

6 Jan, 2020 06:25 IST|Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం. దక్షిణాయనం, హేమంత ఋతువు. పుష్య మాసం. తిథి శు.ఏకాదశి రా.1.34 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం భరణి ప.12.20 వరకు, తదుపరి కృత్తిక. వర్జ్యం రా.1.11 నుంచి 2.56 వరకు. దుర్ముహూర్తం ప.12.27 నుంచి 1.11 వరకు, తదుపరి ప.2.41 నుంచి 3.24 వరకు. అమృతఘడియలు ఉ.7.11 నుంచి 8.54 వరకు. ముక్కోటì (వైకుంఠ) ఏకాదశి.

సూర్యోదయం: 6.36 సూర్యాస్తమయం : 5.36;
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతస్థితి. దైవదర్శనాలు.

వృషభం: పనుల్లో ప్రతిష్ఠంభన. వైద్యసలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

మిథునం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కర్కాటకం: చిత్రవిచిత్ర సంఘటనలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు కొంత మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఉద్యోగయత్నాలు కొంత ఫలిస్తాయి.

సింహం: వ్యవహారాలలో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కన్య: కన్య...కుటుంబసభ్యులతో విభేదిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. స్వల్ప అనారోగ్యం, వైద్యసలహాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

తుల: శుభవార్తలు వింటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది.

వృశ్చికం: కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

ధనుస్సు:  కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువులతో చర్చలు. స్వల్ప అనారోగ్యం, వైద్యసేవలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. వ్యాపారాలలో కొన్ని అవాంతరాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి.

కుంభం: కుంభం...ఇంట్లో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మీనం: మీనం...పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. శ్రమకు ఫలితం స్వల్పమే. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు