గ్రహం అనుగ్రహం(20-02-2020)

20 Feb, 2020 06:47 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువుమాఘ మాసం, తిథి బ.ద్వాదశి సా.5.10 వరకు, తదుపరి త్రయోదశినక్షత్రం పూర్వాషాఢ ఉ.9.02 వరకు, తదుపరి ఉత్తరాషాఢవర్జ్యం సా.5.16 నుంచి 5.55 వరకు, దుర్ముహూర్తం ఉ.10.18నుంచి 11.03 వరకు, తదుపరి ప.2.55 నుంచి 3.41 వరకుఅమృతఘడియలు.. రా.3.12 నుంచి 4.33 వరకు.

సూర్యోదయం :   6.28
సూర్యాస్తమయం  :  5.59
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. దూర ప్రయాణాలు. పనులు ముందుకు సాగవు. బంధువిరోధాలు. కృషి ఫలించదు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: అంచనాలు తప్పుతాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు ఉంటాయి.

మిథునం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వస్తులాభాలు. మీ సత్తా చాటుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వేడుకల్లో పాల్గొంటారు.

కర్కాటకం: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అందరిలోనూ గుర్తింపు. యత్నకార్యసిద్ధి. బంధువుల నుంచి శుభవర్తమానాలు. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

సింహం: పనుల్లో ఆటంకాలు. వృధా ధనవ్యయం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కన్య: ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. పనుల్లో  ఆటంకాలు. మిత్రులతో స్వల్ప వివాదాలు.  వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహం. అనారోగ్యం. ఆలయ దర్శనాలు.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. చిత్రమైన  సంఘటనలు. అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృశ్చికం: కుటుంబంలో చికాకులు. ఆదాయం తగ్గుతుంది. దూరప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.  ఆరోగ్యసమస్యలు.

ధనుస్సు: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.  వాహనయోగం.

మకరం:  వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. కష్టపడ్డా ఫలితం ఉండదు.  ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

కుంభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. కొన్ని సమస్యలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆస్తి లాభ సూచనలు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు