గ్రహం అనుగ్రహం (20-03-2020)

20 Mar, 2020 05:44 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి బ.ఏకాదశి ఉ.7.47 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం శ్రవణం సా.6.33 వరకు, తదుపరి ధనిష్ఠవర్జ్యం రా.10.48 నుంచి 12.31 వరకు, దుర్ముహూర్తం ఉ.8.32 నుంచి 9.21 వరకు, తదుపరి ప.12.30 నుంచి 1.20 వరకుఅమృతఘడియలు... ఉ.7.34 నుంచి 9.02 వరకు.

సూర్యోదయం :    6.09
సూర్యాస్తమయం    :  6.06
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: నూతనోత్సాహం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగలాభం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృషభం: ఏ పని చేపట్టినా ముందుకు సాగదు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ధనవ్యయం. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మిథునం: సన్నిహితులతో వివాదాలు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆధ్యాత్మిక చింతన. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు.

సింహం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

కన్య: సన్నిహితులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరవుతారు.

తుల: కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉన్నత స్థితి.

ధనుస్సు: పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. ధనవ్యయం.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు. విందువినోదాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి.

కుంభం: పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మీనం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో కొత్త ఆశలు. దైవదర్శనాలు చేసుకుంటారు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు