గ్రహం అనుగ్రహం (08-09-2019)

8 Sep, 2019 08:08 IST|Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి శు.దశమి  రా.1.12 వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం మూల ఉ.10.33 వరకు తదుపరి పూర్వాషాఢ వర్జ్యం ఉ.8.56 నుంచి 10.34 వరకు తిరిగి రా.8.34 నుంచి 10.14 వరకు దుర్ముహూర్తం సా.4.26 నుంచి 5.15 వరకు అమృతఘడియలు...లేవు

సూర్యోదయం : 5.50
సూర్యాస్తమయం : 6.06 

రాహుకాలం : సా.4.30 నుంచి 6.00
యమగండం : ప.12.00 నుంచి 1.30

భవిష్యం :
మేషం : కుటుంబసభ్యులతో అకారణ వైరం. బంధువుల నుంచి ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో కొంత నిరాశ. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన.

వృషభం : కుటుంబంలో ఒత్తిడులు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు.

మిథునం : సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

కర్కాటకం : పడిన శ్రమ ఫలితమిస్తుంది. కొత్త పరిచయాలు. అదనపు రాబడి ఉంటుంది. చిరకాల మిత్రులను కలుస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. విందువినోదాలు.

సింహం : పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరాశ.

కన్య : ముఖ్యమైన పనులు వాయిదా. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు. ధనవ్యయం.

తుల : వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. వాహనాలు కొంటారు. సంఘంలో గౌరవం. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు పొందుతారు.

వృశ్చికం : కొత్తగా అప్పులు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు. దైవదర్శనాలు.

ధనుస్సు : కొత్త పనులు చేపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

మకరం : ఉద్యోగ బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలు నిరాశపరుస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆధ్యాత్మిక చింతన.

కుంభం : సంఘంలో గౌరవమర్యాదలు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది. విందువినోదాలు.

మీనం : పలుకుబడి పెరుగుతుంది. ఆలయాల దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి.

– సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు