గ్రహం అనుగ్రహం (15-11-2019)

15 Nov, 2019 05:36 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.తదియ రా.7.13 వరకు, తదుపరి చవితి నక్షత్రం మృగశిర రా.11.29 వరకు, తదుపరి ఆరుద్రవర్జ్యం ఉ.4.45 నుంచి 6.34 వరకు, దుర్ముహూర్తం ఉ.8.22 నుంచి 9.05 వరకు, తదుపరి ప.12.05 నుంచి 12.53 వరకు,అమృతఘడియలు...ప.2.36 నుంచి 4.12 వరకు.

సూర్యోదయం :    6.08
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ప్రత్యర్థుల నుంచి సహాయం అందుతుంది.ఆస్తి వివాదాలు తీరి లాభపడతారు. వ్యాపారాలలో అనుకూలం. ఉద్యోగులకు పైస్థాయి నుంచి అభినందనలు.

వృషభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో  స్వల్ప లాభాలు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

మిథునం: నూతన ఉద్యోగావకాశాలు.. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి.

కర్కాటకం: ఆర్థిక విషయాలు కొంత గందరగోళం. బంధువర్గంతో చర్చలు.  శ్రమ పెరుగుతుంది. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు సామాన్యం.  ఉద్యోగాల్లో ఒత్తిడులు.

సింహం: అంచనాలు నిజమవుతాయి. యత్నకార్యసిద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

కన్య: భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. చర్చలు ఫలిస్తాయి. సంఘంలోగౌరవమర్యాదలు పొందుతారు. పనుల్లో విజయం. ఆకస్మిక ధనలబ్ధి.వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి.

తుల: వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో విరోధాలు. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాVతతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.  కళాకారులకు  చికాకులు.

వృశ్చికం: చేపట్టిన పనుల్లో  ఆటంకాలు. ధనవ్యయం. రుణదాతల ఒత్తిడులు. బంధువర్గంతో మాటపట్టింపులు.  వ్యాపారాలలో వివాదాలు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. కొన్ని పనులలో విజయం. ధార్మికకార్యక్రమాలపై ఆసక్తి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు.  ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు.

మకరం: కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆప్తుల నుంచి సలహాలు అందుకుంటారు. యత్నకార్యసిద్ది. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో  ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం: రుణయత్నాలు సాగిస్తారు.  ఆప్తులతో వివాదాలు. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.

మీనం: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకోని  మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా