గ్రహం అనుగ్రహం (18-07-2019)

18 Jul, 2019 06:33 IST|Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, తిథి బ.విదియ తె.4.41 వరకు (తెల్లవారితే శుక్రవారం)నక్షత్రం శ్రవణం రా.1.31 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం తె.4.55 నుంచి 6.40 వరకు (తెల్లవారితే శుక్రవారం), దుర్ముహూర్తం ఉ.8.11 నుంచి 9.04 వరకు, తదుపరి ప.12.29 నుంచి 1.21 వరకుఅమృతఘడియలు... ప.1.11 నుంచి 2.54 వరకు.

సూర్యోదయం :    5.38
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన ప్రగతి.

వృషభం: మిత్రులతో మాటపట్టింపులు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. ముఖ్యమైన పనుల్లో స్వల్ప ఆటంకాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత భారంగా సాగుతాయి.

మిథునం: చిత్రవిచిత్ర సంఘటనలు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో  మరింత ఉన్నతి.

కర్కాటకం: నూతన ఉద్యోగాలు పొందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కన్య: మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. దూరప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

తుల: వివాదాలు కొన్ని చికాకు పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. బంధువులతో అకారణంగా తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తిలాభం. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

ధనుస్సు: మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మకరం: శుభవార్తలు వింటారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. భూలాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కుంభం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు.

మీనం: దూరపు బంధువుల నుంచి ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు