గ్రహం అనుగ్రహం (22-01-2020)

22 Jan, 2020 05:58 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి బ.త్రయోదశి రా.2.10 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం మూల రా.1.04 వరకు, తదుపరి పూర్వాషాఢ వర్జ్యం ఉ.9.05 నుంచి 10.41 వరకు, తిరిగి రా.11.29 నుంచి 1.04 వరకు, దుర్ముహూర్తం ప.11.50 నుంచి 12.33 వరకు అమృతఘడియలు... సా.6.40 నుంచి 8.15 వరకు.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.46
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: పనుల్లో ప్రతిష్ఠంభన. బంధువులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృషభం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

మిథునం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వస్తులాభాలు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.

కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు ఉన్నత అవకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కన్య: మిత్రులతో కలహాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృశ్చికం: శ్రమ మరింత పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

ధనుస్సు: చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహన, కుటుంబసౌఖ్యం. కీలక నిర్ణయాలు. బంధువులతో సఖ్యత. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మకరం: మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఎంతగా శ్రమపడ్డా ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం:  కొన్ని పనులు సమయానికి పూర్తి. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం: ఇంటర్వ్యూలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు