గ్రహం అనుగ్రహం (24-10-2019)

24 Oct, 2019 05:12 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువుఆశ్వయుజ మాసం, తిథి బ.ఏకాదశి రా.6.54 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం మఖ ఉ.10.46 వరకు, తదుపరి పుబ్బవర్జ్యం సా.6.13 నుంచి 7.43 వరకు, దుర్ముహూర్తం ఉ.9.49 నుంచి 10.36 వరకు, తదుపరి ప.2.26 నుంచి 3.12 వరకుఅమృతఘడియలు... ఉ.8.31 నుంచి 10.01 వరకు.

సూర్యోదయం :    5.58
సూర్యాస్తమయం    :  5.32
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: ముఖ్యమైన కార్యక్రమాల్లో అవరోధాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత  నిరాశ కలిగిస్తాయి.

వృషభం: కొత్తగా రుణాలు యత్నాలు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొంత గందరగోళం. దైవదర్శనాలు.

మిథునం: శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆకస్మిక ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలమవుతాయి.

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం.  వ్యాపారాలు, ఉద్యోగాలు  మందకొడిగా సాగుతాయి. సోదరులతో విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం: సన్నిహితులు దగ్గరవుతారు. కుటుంబసౌఖ్యం. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగాలు, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయ దర్శనాలు. కళాకారులకు సత్కారాలు.

కన్య: అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. ఉద్యోగాలు,  వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. ఆలయాలు సందర్శిస్తారు.

తుల: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహ, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ధనవ్యయం. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు.  బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. ఆలయ దర్శనాలు.

మకరం: కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యయప్రయాసలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. 

కుంభం: కొత్త కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆకట్టుకుంటుంది. శుభవార్తలు వింటారు. ధన, వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత..

మీనం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. పనుల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు