గ్రహం అనుగ్రహం (25-09-2019)

25 Sep, 2019 06:38 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి బ.ఏకాదశి ఉ.9.50 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం ఆశ్లేష తె.4.18 వరకు (తెల్లవారితే గురువారం), వర్జ్యం సా.5.43 నుంచి 7.13 వరకు, దుర్ముహూర్తం ప.11.28 నుంచి 12.16 వరకుఅమృతఘడియలు... రా.2.46 నుంచి 4.15 వరకు.

సూర్యోదయం :    5.53
సూర్యాస్తమయం    :  5.53
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృషభం:  పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వస్తు,వస్త్ర లాభాలు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలలో పురోగతి.

మిథునం: శ్రమ తప్పదు. పనుల్లో ఆటంకాలు. బంధువులు, మిత్రులతో వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. ఆలయ దర్శనాలు.

కర్కాటకం: నూతన ఉద్యోగయోగం. పనుల్లో మరింత పురోగతి. ఇంటాబయటా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార  లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

తుల: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

వృశ్చికం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు.

ధనుస్సు: కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు. నిరుద్యోగులకు గందరగోళం.

మకరం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. పనుల్లో విజయం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

కుంభం: ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు. దైవదర్శనాలు.

మీనం: వ్యయప్రయాసలు ఉండవచ్చు. ధనవ్యయం. పనుల్లో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. విద్యార్థులకు ఒత్తిడులు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా