గ్రహం అనుగ్రహం (29-08-2019)

29 Aug, 2019 06:22 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.చతుర్దశి సా.6.55 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం ఆశ్లేష రా.8.17 వరకు, తదుపరి మఖ వర్జ్యం ఉ.9.43 నుంచి 11.16 వరకు, దుర్ముహూర్తం ఉ.9.55 నుంచి 10.45 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.43 వరకుఅమృతఘడియలు... సా.6.44 నుంచి 8.13 వరకు.

సూర్యోదయం :    5.48
సూర్యాస్తమయం    :  6.14
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: ముఖ్యమైన  పనుల్లో ప్రతిబంధకాలు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. ధనవ్యయం.

వృషభం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశయాలు నెరవేరతాయి. వస్తు, వస్త్రలాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

మిథునం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం. శ్రమ తప్పకపోవచ్చు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కర్కాటకం: శుభవార్తలు. వాహనయోగం. పనుల్లో విజయం. ఆప్తులు, బం«ధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. నూతన ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగానే ఉంటాయి.

కన్య: కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

తుల:ఇంటర్వ్యూలు అందుకుంటారు. వస్తులాభాలు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. దైవచింతన. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృశ్చికం: చేపట్టిన పనులు కొంత నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు:పరిస్థితులు అనుకూలించవు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. కష్టానికి ఫలితం దక్కుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: సన్నిహితుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. విందువినోదాలు. వాహనాలు కొంటారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మీనం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. పనులలో ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిదానిస్తాయి.
– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు