గ్రహం అనుగ్రహం (11-09-2019)

11 Sep, 2019 06:01 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్షఋతువు, భాద్రపద మాసం, తిథి శు.త్రయోదశి తె.4.32 వరకు (తెల్లవారితే గురువారం), నక్షత్రం శ్రవణం ప.3.02 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం రా.7.23 నుంచి 9.11 వరకుదుర్ముహూర్తం ప.11.31 నుంచి 12.20 వరకుఅమృతఘడియలు... లేవు.

సూర్యోదయం : 5.50
సూర్యాస్తమయం :  6.04
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు

భవిష్యం
మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దూరప్రయాణాలు.ఆలయ దర్శనాలు. ధనలబ్ధి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విందువినోదాలు.

వృషభం:  ఆర్థికపరమైన ఇబ్బందులు. పనుల్లో తొందరపాటు. బంధువులతో వివాదాలు.  శ్రమాధిక్యం. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

మిథునం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగుల యత్నాలు కొంత మందగిస్తాయి. దైవదర్శనాలు.

కర్కాటకం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య∙నిర్ణయాలు. వృత్తి,వ్యాపారాలు ఆశాజనకంగాఉంటాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు. విద్యార్థులకు శుభవార్తలు.

సింహం: పనులు విజయవంతమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ధన, వస్తులాభాలు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది.

తుల: ప్రయాణాలు వాయిదా. పనుల్లో అవరోధాలు. మిత్రులతో విభేదాలు.ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం.

వృశ్చికం: ఉద్యోగయత్నాలు అనుకూలం. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.వృత్తి,వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. కళాకారులకు సత్కారాలు.

ధనుస్సు: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.బంధువులతో తగాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి.

కుంభం: అనుకోని ధనవ్యయం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయ దర్శనాలు. ఆరోగ్యసమస్యలు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు.

మీనం: ప్రయత్నాలలో అనుకూలత. సోదరుల నుంచి ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. కుటుంబసమస్యలు తీరతాయి. నిరుద్యోగులు ఉద్యోగాలు దక్కించుకుంటారు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు