గ్రహం అనుగ్రహం (17-08-2019)

17 Aug, 2019 05:07 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.విదియ రా.8.10 వరకు, తదుపరి తదియ, నక్షత్రం శతభిషం ప.12.44 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం రా.7.51 నుంచి 9.36 వరకుదుర్ముహూర్తం ఉ.5.45 నుంచి 7.24 వరకుఅమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం    :  6.22
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం:పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు.

వృషభం: పలుకుబడి మరింత పెంచుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు. స్థిరాస్తివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు.

మిథునం: సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో కొంత గందరగోళం. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కర్కాటకం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆ«లయాలు సందర్శిస్తారు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొన్ని సమస్యలు. ఉద్యోగాలలో వివాదాలు.

సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: ఆర్థిక లాభాలు పొందుతారు. పనులు చకచకా సాగుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తివివాదాల పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

తుల: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో స్వల్ప విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

వృశ్చికం: సన్నిహితులతో వివాదాలు. దూరప్రయాణాలు. రుణయత్నాలు. పనులలో జాప్యం. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

ధనుస్సు: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి, ధనలాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. పనులు విజయవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని ప్రశంసలు.

మకరం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

కుంభం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో హోదాలు.

మీనం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. పనులు మందగిస్తాయి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు