మార్కెట్‌ యార్డు లేక రైతుల విలవిల 

26 Mar, 2018 07:05 IST|Sakshi
నిల్వ ఉంచిన కందులు 

ఆళ్లపల్లి : ప్రవేట్‌ దళారుల చేతిలో మోసపోవద్దని ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశ్యంతో  పండించిన పంటలకు మార్కెట్‌ యార్డు,కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేస్తుందనుకుంటే అతి తక్కువ రోజులు మార్కెట్‌ యార్డులను కేటాయించి, రైతులకు సమాచారం అందే లోపే మార్కెట్‌ యార్డులను మూసివేయడం ద్వారా మండలానికి సంబంధించిన కందులను పండించిన రైతులు నానా అవస్థలు పడుతున్నారు.ఎంతో కష్టంతో ఆరుగాలం పండించిన పంట అటు మార్కెట్‌ యార్డులు మూసివేయడంతో ఇంట్లో నిల్వ ఉన్న కందులను ప్రవేట్‌ దళారులకు తక్కువ ధరకు అమ్ముకోలేక రైతులు ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు. 

ప్రభుత్వం ఆదుకోవాలి 
కంటికి రెప్పలా కాపాడుకొని పండించిన పంట అతి తక్కువ ధరలకు  దళారులకు అమ్ముకుంటే చాలా నష్టపోతామని,ఎలాగైనా  ప్రభుత్వం మార్కెట్‌ యార్డులను తెరిపించి మమ్ములను ఆదుకోవాలని  ప్రభుత్వాన్ని విన్నవించారు.
 –గొగ్గెల రమేష్,మైళారం 

మార్కెట్‌ యార్డులను పునఃప్రారంభించాలి 
మాకు సమాచారం అందేలోపే ప్రభుత్వం కేటాయించిన గడువు పూర్తి కావడంతో చాలా మనోవేధనకు గురయ్యానని,ఎలాగైనా  మార్కెట్‌ యార్డులను పునఃప్రారంబించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
–గొగ్గెల సత్యనారాయణ,మైళారం 

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..మండల వ్యవసాయాధికారి ఆర్‌.శంకర్‌
రైతుల సమస్యని ఉన్నతాధికారుల దృష్టికి దృష్టికి తీసుకెళ్తానని, మార్కెట్‌ యార్డును పునః ప్రారంభించాలాఆ కృషి చేస్తానని అన్నారు.పై అధికారుల నుంచిఆడర్‌ లేకుండా నేనేమీ చేయలేనని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు