సమాధి తవ్వి.. పోస్టుమార్టం

21 Feb, 2018 15:24 IST|Sakshi
సమాధిని తవ్విస్తున్న సీఐ అబ్బయ్య

అశ్వారావుపేట : మృతురాలి బంధువుల ఏమరుపాటు పోలీసులకు పెద్ద పనే పెట్టింది. అశ్వారావుపేట బీసీ కాలనీలోని జంగాల బజారుకు చెందిన కళ్యాణపు నాగమ్మ(75), జనవరి 31న చలి కాగుతుండగా ఫిట్స్‌ రావడంతో చలి మంటలో పడి తీవ్రంగా గాయాలపాలైంది. ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మనుమడు సిరిగిరి తిరుపతిరావు చేర్పించి, స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నాగమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి, ఖమ్మం ఆస్పత్రులకు కుటుంబీకులు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందింది. నాగమ్మ మృతిచెందిన విషయాన్ని పోలీసులకు తెలపకుండా ఖననం చేశారు. పెండింగులోగల ఈ కేసు వివరాలు తెలుసుకోవాలని సిబ్బందిని సీఐ ఎం.అబ్బయ్య ఆదేశించారు. దీంతో అసలు విషయం బయటపడింది. సీఐ దగ్గరుండి ఆ సమాధిని తవ్వించారు. ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రత్యూష, మంగీలాల్‌ పోస్టుమార్టం నిర్వహించారు.

మరిన్ని వార్తలు