రచ్చకెక్కిన కమెడియన్లు..!

18 Mar, 2018 17:42 IST|Sakshi

సాక్షి, ముంబై : ప్రముఖ బాలీవుడ్‌ కామెడీ షో ‘‘ది కపిల్‌ శర్మ షో’’ హోస్ట్‌ కపిల్‌ శర్మ, కమెడియన్‌ సునీల్‌ గ్రోవర్‌ల గొడవ ఇప్పుడు రచ్చకెక్కింది. ట్విటర్‌ వేదికగా వీరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శనివారం సునీల్‌ గ్రోవర్‌ తన ట్విటర్ ఖాతాలో ఓ అభిమానికి ఇచ్చిన సమాధానం గొడవకు ఆజ్యం పోసినట్లైంది. కపిల్‌ కొత్త షో నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదని, తను కూడా కపిల్‌ ఫోన్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు సునీల్‌ ట్వీట్ చేశారు. దీనికి సమాధానంగా కపిల్‌ శర్మ స్పందిస్తూ.. ‘‘సునీల్‌ అబద్దం చెబుతున్నాడు. నేను వందల సార్లు సునీల్‌కు ఫోన్ చేశాను. సునీల్ గ్రోవర్ ఇంటికి నా మనషులను పంపించాను. స్వయంగా నేను కూడా వెళ్లాను. అయిందేదో అయిపోయింది నా పేరు పాడు చేయాలని చూస్తే ఊరుకోనని’’  కపిల్ పోస్ట్ చేశాడు.

దీనికి సమాధానంగా ‘‘ ఈ నవరాత్రి ఎవరూ అబద్దం చెప్పరు ’’అని సునీల్‌ పోస్ట్‌ చేశారు. దీంతో మండిపడ్డ కపిల్‌ ‘‘ఇప్పటికే చాలా ఎక్కువైంది.. వ్యక్తిగతం అంటూ ఏవీ లేవు ఇక అన్నీ ట్విటర్‌లోనే’’ అని పోస్ట్‌ చేశారు. కొన్ని నెలల కిందట ఈ గొడవ కారణంగా సునీల్‌ గ్రోవర్‌ను షో నుంచి పంపేసిన విషయం తెలిసిందే. విమాన ప్రయాణంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న వివాదం చినికి చినికి గాలి వానగా మారి నెంబర్‌.1గా ఉన్న షోను తక్కువ రేటింగ్స్‌ కారణంగా నిలిపివేశారు. చాలా రోజుల తర్వాత కపిల్‌ శర్మ తన కొత్త షో ‘‘ఫ్యామిలీ టైం విత్‌ కపిల్‌ శర్మ’’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Read latest Bollywood News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు