దీనస్థితిలో సల్మాన్‌ హీరోయిన్‌!

19 Mar, 2018 15:57 IST|Sakshi

సాక్షి, ముంబై : సినిమా.. అదో రంగుల ప్రపంచం. స్టార్‌డమ్‌ ఉన్నంత వరకు ఆడిందే ఆటగా జీవితం సాగిపోతుంది. ఖరీదైన కార్లు, బంగ్లాలు ఇలా విలాసవంతమైన జీవితాన్ని గడిపేస్తారు. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. అదృష్టం ఉన్నంత వరకు జల్సాగా నడిచే జీవితం.. అది కాస్త తిరగబడితే బతుకు రోడ్డు మీద కొచ్చేస్తుంది. అవకాశాలు ఉన్నపుడు కోట్లు తీసుకున్న నటీనటులు అవకాశాలు లేక కూటికోసం అల్లాడిపోయిన సంఘటనలు కోకొల్లలు. బాలీవుడ్‌ హీరోయిన్‌ పూజా దాద్‌వల్‌ జీవితంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. 

పరిస్థితులే కాదు అనారోగ్యం కూడా ఆమె పాలిట శాపంలా మారింది. టీబీ మహమ్మారి ఆమెకు బతుకు భారంగా మారింది. సరైన తిండి లేక, మందులు కొనడానికి డబ్బులు లేక దీనంగా జీవితాన్ని వెల్లదీస్తోంది. 1995లో వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ బ్లాక్ బాస్టర్‌ ‘వీర్‌గాటి’ సినిమాలో నటించి మెప్పించింది పూజ. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆమె ఇబ్బందులు ఎదుర్కుంటోంది. పూజ ముంబైలోని శివ్‌ది హాస్సిటల్‌లో చికిత్స పొందుతోంది. 

‘‘ఆరు నెలల కిందట నాకు టీబీ ఉందని తెలిసింది. సల్మాన్‌ ఖాన్‌ని సహాయం అడగడానికి ప్రయత్నిస్తున్నా కుదరటం లేదు. 15 రోజుల కిందటే శివ్‌ది హాస్సిటల్‌లో చేరాను. ప్రస్తుతం నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. కనీసం టీ తాగడానికి కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని’ ఆమె తెలిపింది. పూజ దావల్‌కు టీబి ఉందని తెలుసుకున్న భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయారట. బాలీవుడ్‌ హిట్‌ చిత్రాలు హిందుస్తాన్‌, వీర్‌గాటి, సింధూర్‌ సౌగంథ్‌లో నటించిన విషయం తెలిసిందే. 

Read latest Bollywood News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు