ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లిస్తే.. 0.75% డిస్కౌంట్‌!

22 Dec, 2016 01:26 IST|Sakshi
ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లిస్తే.. 0.75% డిస్కౌంట్‌!

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకే..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ‘బీఎస్‌ఎన్‌ఎల్‌’ వినియోగదారులు వారి బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించడం ద్వారా 0.75% డిస్కౌంట్‌ పొందొచ్చని టెలికం మంత్రి మనోజ్‌ సిన్హా తెలిపారు. క్యాష్‌లెస్‌ లావాదేవీలకుమద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ పోర్టల్‌ లేదా బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా పోస్ట్‌–పెయిడ్‌ (ల్యాండ్‌లైన్‌/బ్రాడ్‌బాండ్‌/జీఎస్‌ఎం) బిల్లులు లేదా జీఎస్‌ఎం ప్రి–పెయిడ్‌ రీచార్జ్‌లనుచెల్లించడం ద్వారా డిస్కౌంట్‌ పొందొచ్చని తెలిపారు. ఈ సౌలభ్యం డిసెంబర్‌ 22 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ అందుబాటులో ఉంటుందన్నారు.  

డేటామెయిల్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒప్పందం దేశీయంగా 8 ప్రాంతీయ భాషల్లో ఈమెయిల్‌  సేవలు అందించే దిశగా బీఎస్‌ఎన్‌ఎల్‌ తాజాగా డేటామెయిల్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో తమ బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లు సొంత భాషలోనే డేటామెయిల్‌ సర్వీస్‌ద్వారా ఈమెయిల్‌ ఐడీని రూపొందించుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎండీ అనుపమ్‌ శ్రీవాస్తవ్‌ తెలిపారు. తెలుగు, హిందీ సహా 8 భాషల్లో ఈ సర్వీసులు లభిస్తాయని ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు