అక్కడ రోజుకు 1700 మంది మిలీనియర్లు!

13 May, 2017 09:50 IST|Sakshi
అక్కడ రోజుకు 1700 మంది మిలీనియర్లు!
వేతనాల వృద్ధి ఆశించినంతగా లేకపోవడం, యంగ్ అమెరికన్లకు ఉద్యోగవకాశాలు తగ్గుతున్నప్పటికీ, అమెరికా మిలీనియనర్లకు కంచుకోటలా మారుతోంది. వచ్చే ఏళ్లలో మిలీనియర్ జాబితాను చేరుకునే వారిలో రోజుకు సగటున 1700 మంది అమెరికన్లే ఉంటారని బ్లూమ్ బర్గ్ రిపోర్టులు వెల్లడించాయి. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంచనాల ఆధారంగా బ్లూమ్ బర్గ్ ఈ రిపోర్టు నివేదించింది. 2020  ఏడాది వరకు మిలీనియర్ క్లబ్ లో 3.1 మిలియన్ మంది కొత్త వ్యక్తులు వచ్చి చేరతారని అమెరికా అంచనావేస్తోంది. 2010 నుంచి 2015 మధ్యలో ఈ సంఖ్య 2.4 మిలియన్లకు పెరిగినట్టు కూడా తెలిపింది. ప్రస్తుతం 80 లక్షల అమెరికన్ హౌజ్ హోల్డ్స్ ఆస్తుల విలువ 1 మిలియన్ డాలర్లకు పైననే ఉంటుందని ఈ సంస్థ నివేదించింది.
 
దీనిలో ప్రాపర్టీస్, లగ్జరీ గూడ్స్  ఉంటాయని పేర్కొంది. చరిత్రలోనే సంపద బదిలీ ఇక్కడ అత్యధిక స్థాయిలో ఉండి, ఒక్కో వ్యక్తి సంపాదను కూడా భారీగా పెరుగనున్నట్టు వివరించింది. అమెరికన్ల చాలా సంపద పాత తరాల మధ్యే కేంద్రీకృతమై ఉందని బోస్టన్ సంస్థ చెప్పింది. సర్వేలో పాల్గొన్న 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఇన్వెస్టర్లు వద్ద ఆస్తులు 25 మిలియన్ డాలర్లపైనే ఉంటాయని, వారసత్వమే వీరి విజయానికి బాటలు వేస్తుందని స్పెక్ట్రమ్ గ్రూప్ అధ్యయనం వెల్లడించింది.  అయితే మిలీనియర్ కావడం అంత పెద్ద విషయమేమి కాదని, కొనుగోలు శక్తి ప్రస్తుతం 1 మిలియన్ డాలర్ల నికర సంపదగా కలిగి ఉంటే, 1980లో అది 3,41,000 డాలర్లని, 20వ సెంచరీ మొదట్లో 45వేల డాలర్లని బ్లూమ్ బర్గ్ పేర్కొంది.
మరిన్ని వార్తలు