కోవిద్‌ -19 సంక్షోభంలోనూ రాణించిన టాప్‌-10 కంపెనీలు ఇవే.!

28 May, 2020 14:13 IST|Sakshi

ఫార్మా, రిటైల్‌ కంపెనీలే అధికం

రానున్న రోజుల్లో ఇదే తీరు ప్రదర్శించే అవకాశం

కోవిద్‌-19 ఎఫెక్ట్‌ కారణంగా బీఎస్‌ఈ -500 కంపెనీల నికర లాభాలు, త్రైమాసిక ఆదాయాల క్షీణించుకుపోయాయి. అయితే బీఎస్‌ఈ -500 కంపెనీల్లో ఓ 10కంపెనీలు మాత్రం సంక్షోభాన్ని సమర్థవంతగా ఎదుర్కోని అమ్మకాల్లో 20-30శాతం వృద్ధిని, 4 రెట్ల వరకు నికరలాభాన్ని ఆర్జించగలిగాయి. రానున్న రోజుల్లోనూ ఈ టాప్‌ -10 కంపెనీల ఆదాయాలు పెరుగుదల, మార్కెట్ వాటా లాభాల తమ సహచర కంపెనీల కంటే మెరుగ్గా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక త్రైమాసికంలో రూ.500 కోట్ల మించి అమ్మకాలు జరిపిన కంపెనీలకు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కంపెనీల గురించి తెలుసుకుందాం...

1. ట్రెంట్‌ లిమిటెడ్‌: రిటైల్‌ రంగంలో సేవలు అందిస్తుంది. ఈ మార్చి క్వార్టర్లో కంపెనీ నికరలాభం 4రెట్లు పెరిగింది. ఈ క్యూ4లో కంపెనీ రూ.32.65 కోట్ల నికరలాభాన్ని సాధించింది. అంతకు ముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం రూ. 8.13 కోట్లుగా ఉంది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ అమ్మకాలు 20శాతం వృద్ధిని సాధించింది

‘‘ట్రెంట్‌ లిమిటెడ్‌కు కూడా తన సహచర కంపెనీలతో పాటు ట్రెంట్‌ లిమిటెడ్‌కు కూడా కోవిద్‌-19 సంక్షోభం తాకింది. ట్రెంట్‌కు ఉండే భారీ మూలధనం కారణంగా సంక్షోభం సమర్థవంతంగా ఎదుర్కోనే సత్తా తన సహచర కంపెనీలతో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో మార్కెట్‌ వాటాను దక్కించుకునే అవకాశ ఉంది.’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో నికర నగదు కలిగి ఉండటం ట్రెంట్‌కు కలిసొచ్చే అంశమని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది.

2. యూపిఎల్‌: సస్య సంరక్షణ ఔషధాల తయారీలో అగ్రగామిగా వెలుగొందుతుంది. ఈ క్యూ4లో కంపెనీ నికర లాభం 2.61రెట్లు పెరిగింది. ఈ మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.761 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంతకు ముందు ఇదే ఏడాది కంపెనీ నికరలాభం కేవలం రూ.291కోట్లుగా ఉంది. అలాగే అమ్మకాలు గతేడాది క్యూ4లో రూ.8,525 కోట్లు నమోదయ్యాయి. ఈ క్యూ4 కాలానికి రూ.11,141 కోట్లకు చేరుకున్నాయి. 

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ నిర్మల్‌ బంగ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ యూపీఎల్‌ షేరుకు టార్గెట్‌ ధరను రూ.643గా నిర్ణయించారు. ఈ టార్గెట్‌ ధరను షేరు ప్రస్తుత ధరకు 70శాతం అప్‌సైడ్‌లో ఉంది. 

మరో బ్రోకరేజ్‌ ఎంకే షేరు టార్గెట్‌ ధరను రూ.500గా నిర్ణయించింది. మార్కెట్‌లో వాటాను పెంచుకోవడం, మార్జిన్లను పెంచుకోవడం, అడ్జెటెడ్‌ నికర రుణ/ఎబిట్డాను ఆర్థిక సంవత్సరం 2022 నాటికి రెండు రెట్లు తగ్గింపు లక్ష్యంగా పెట్టుకోవడం లాంటి సానుకూలాంశంలో షేరు ఐదేళ్ల కనిష్ట వాల్యూయేషన్ల నుంచి తిరగి రీ-రేటింగ్‌ పొందుతుందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.

3. లారస్‌ ల్యాబ్స్‌: హైదరాబాద్‌ ఆధారిత ఔషధ తయారీ కంపెనీ ఈ క్యూ4లో 100శాతం నికర లాభాన్ని ఆర్జించింది. గత మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.43.17 కోట్ల నికర లాభాన్ని సాధించగా, ఈ మార్చిలో 110.15 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. అమ్మకాలు సైతం వార్షిక ప్రాతిపదికన 32శాతం వృద్ధి చెంది రూ.839 కోట్లకు చేరుకున్నాయి. ఫార్ములేషన్‌లో బలమైన ఆర్డర్‌ విజిబిలితో, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే దూకుడును కొనసాగించాలని కంపెనీ ఆశిస్తోంది.

కోవిద్‌-19 నివారణలో వినియోగించే హెడ్రాక్సిక్లోరిఫిన్‌ సరఫరాతో మరింత లాభపడే అవకాశం ఉంది.దీని ఫలితాలు జూన్‌ క్వార్టర్లో ప్రతిబింబిస్తాయని బీఓబీ క్యాపిటల్‌ మార్కెట్‌ తెలిపింది. షేరు టార్గెట్‌ ధరను రూ.510 నుంచి రూ.630కు పెంచినట్లు బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజ్‌ సైతం షేరు టార్గెట్‌ ధరను రూ.520 నుంచి రూ.615కు పెంచింది. 

4. అలెంబిక్‌ ఫార్మా: మార్చి త్రైమాసికంలో నికర లాభం 30 శాతం పెరిగింది. అమ్మకాలు 45శాతం వృద్ధిని సాధించాయి. ఫార్మా రంగంలో నెలకొన్న సానుకూల పరిస్థితి అలెంబిక్‌ కలిసొస్తుందని యస్‌ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో షేరు సెక్టోరియల్‌ సగటుకు ప్రీమియంలో ట్రేడయ్యే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. 

5. అజంతా ఫార్మా: వార్షిక ప్రాతిపదిన ఈ క్యూ4లో నికర లాభం 32 శాతం వృద్ధిని సాధించింది. అమ్మకాలు 45శాతం పెరిగాయి. మొత్తం ఆదాయంలో కంపెనీ 30శాతం భారత్‌ నుంచే పొందుతుంది. డెర్మటాలజీ విభాగంలో మందగమనం కంపెనీకి స్వల్పకాలిక సవాలుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ భావిస్తోంది. అయితే 
ఆరోగ్యకరమైన మార్జిన్లు, రిటర్న్ ప్రొఫైల్‌, అప్పులు తక్కవగా ఉన్న బ్యాలెన్స్ షీట్ తదితర అంశాలు అజంతాకు కలిసొచ్చే సానుకూలాంశాలు. 

వరుణ్‌ బెవరీజెస్‌: ఈ నాలుగో త్రైమాసికంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించింది. వార్షిక ప్రాతిపదికన కంపెనీ నికరలాభం 53శాతం వృద్ధిని సాధించి రూ.60 కోట్లను ఆర్జించింది. అమ్మకాలు 23శాతం పెరిగి రూ.1,699.24 కోట్లను ఆర్జించింది. వరుణ్‌ బెవరీజెస్‌ సరఫరా చేసే ఉత్పత్తులు తక్కువ ధరలను కలిగి ఉండటంతో కలిగి ఉండటంతో ఇదే రంగంలోని ఇతర కంపెనీలతో పోలిస్తే ఆదాయాల వృద్ధి వేగంగా పుంజుకునే అవకాశం ఉందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ చెప్పుకొచ్చింది. చిన్న కంపెనీలను విలీనంతో మార్కెట్‌ వాటా మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది. 

వీటితో పాటు అవెన్యూ సూపర్‌మార్ట్స్‌, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ కంపెనీలు సైతం మార్చి క్వార్టర్‌లో బలమైన ఫలితాలను ప్రకటించాయి. బలమైన వృద్ధి ఉన్నప్పటికీ.., రాధాకృష్ణ ధమానీ ఆధ్వర్యంలో అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ షేరుపై విశ్లేషకులు 20శాతం డౌన్‌సైడ్‌ ట్రెండ్‌ను సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు