డేటా సేవల మరో సంచలనం: వైఫై డబ్బా

20 Nov, 2017 14:02 IST|Sakshi

సాక్షి, బెంగళూరు:  ఉచిత డేటా, కాలింగ్‌  సేవలతో ఎంట్రీ  ఇచ్చిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకాం ప్రత్యర్థి కంపెనీలకు దడ పుట్టించింది.  అయితే ఉచిత సేవలకు  స్వస్తి చెప్పి.. బాదుడుకు సిద్ధమైన జియోకి షాకిస్తూ ఒక కొత్త స్టార్ట్‌అప్‌  దూసుకుపోతోంది.   రూ.2 ఉంటే చాలు  సూపర్‌ చీప్‌ అండ్‌  సూపర్‌ ఫాస్ట్‌ డేటా  అంటోంది బెంగళూరుకు చెందిన స్టార్ట్‌అప్‌ కంపెనీ వై ఫై డబ్బా. ఇది ప్రారంభమేకానీ.. టెలికాం దిగ్గజాలతో ఢీకొనేలా పక్కా ప్లాన్‌తో  వ్యవస్థాపకులు   సిద్ధమవుతున్నారు.

బెంగళూరు నగరంలో ఐఎస్‌పీ లైసెన్స్‌తో  ఫైబర్‌ ఆప్టిక్స్‌  ద్వారా డేటా సేవలు అందిస్తున్న  వైఫై డబ్బా,  జియో ప్లాన్లతో  పోలిస్తే ఇప్పటికే భారీగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది.  ప్రీ పెయిడ్‌ కస్టమర్లకు సరసమైన ధరల్లో డేటా ప్లాన్లను ఆఫర్‌ చేస్తోంది.  ఉదాహరణకు జియో రూ.19 లపై 150 ఎంబీ  అందిస్తోంటే.. కేవలం రూ.2లకే 100 ఎంబీ డేటా ఆఫర్‌ చేస్తోంది.  అలాగే రూ.10లకే 500ఎంబీ,  రూ.20లకు 1 జీబీ డేటా అందిస్తోంది. 

దిగ్గజ టెలికాం కంపెనీల్లాగా   లక్షలు ఖర్చుపెట్టి  సెల్‌ టవర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా.. రూ. 4వేలతో ఒక డబ్బా(రౌటర్‌) ద్వారా తమ సేవలను విస్తరిస్తోంది.  అతి తక్కువ ఖర్చుతో అతి వేగవంతమైన డేటా  అందించడమే తమ లక్ష్యమని వైఫై డబ్బా ఫౌండర్‌ శర్మ చెబుతున్నారు. అంతేకాదు  ఎలాంటి యాప్‌ ను డౌన్‌ లోన్‌ చేసుకోమని తాము వినియోగదారులకు  కోరడం లేదన్నారు. వంద నుంచి 200మీటర్ల పరిధిలో 50బీపీఎస్‌తో రిలయబుల్‌ సేవల్ని అందిస్తున్నట్టు తెలిపారు. విభిన​ వర్గాలనుంచి తమకు కస్టమర్లు  ఉన్నారన్నారు. ముఖ్యంగా అల్పాదాయ వర్గాల వారికి తమ డేటా సేవలు బాగా చేరుతున్నాయని తెలిపారు. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఉన్న  రోజువారీ వేతన కార్మికులను తమ ప్లాన్లు ఆకర్షిస్తున్నాయన్నారు.

ఇప్పటికే  బెంగళూరు నగరంలో 350రౌటర్‌ లేదా డబ్బాలను అమర్చగా... ఇం​కా 1800 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయట. ప్రస్తుతం స్థానిక్‌ కేబుల్‌ ఆపరేటర్ల భాగస్వామ్యంతో ఈ సేవలను అందిస్తోంది.   కొత్త కనెక్షన్‌ కోసం 5-7రోజుల సమయంపడుతోందని..త్వరలోనే దీన్ని  3-4రోజులకు  తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని శర్మ చెప్పారు..  అలాగే రాబోయే  3-4 ఏళ్లలో లక్షల వైఫై డబ్బాలను ఏర్పాటు చేయాలని  యోచిస్తున్నట్టు చెప్పారు.  కాగా  వైఫై  డబ్బాకి ప్రస్తుతం వై కాంబినేటర్‌  సహా కొన్ని సంస్థలు  ఇన్వెస్టర్లుగా ఉన్నాయి
 

మరిన్ని వార్తలు