కొత్త 100 రూపాయల నాణెం త్వరలో

13 Dec, 2018 20:14 IST|Sakshi

దివంగత ప్రధాని వాజ్‌పేయ్‌ బొమ్మతో త్వరలో  రూ100 నాణెం

సాక్షి, న్యూఢిల్లీ: కొత్త వందరూపాయల నాణెం త్వరలో చలామణి లోకి రాబోతోంది.   దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ముఖచిత్రంతో కొత్త 100 రూపాయల నాణెంను  త్వరలో ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ నాణెం 35 గ్రాముల బరువు ఉంటుంది.

నాణెం వెనుక వైపు  వాజ్‌పేయ్‌ ముఖచిత్రం వుంటుంది. అలాగే  ఈ చిత్రానికి దిగువన దేవనాగరి లిపి,  ఆంగ్లం భాషలో శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి, 1924- 2018 అని ముద్రించి ఉంటుంది.  

మరొకవైపు నాలుగు సింహాల అశోకుని స్థూపం బొమ్మ , సత్యమేవ జయతే(దేవనాగరి లిపి, ఆంగ్లంలో) , ఒకవైపు భారత్‌, మరోవైపు ఇండియా అని, దీనికిందనే 100  ముద్రించి  ఉంటుందని  చెప్పింది. 

మరిన్ని వార్తలు