టెనార్‌ డి స్పెసిఫికేషన్స్‌ ఇవే..

21 Dec, 2017 13:40 IST|Sakshi

సాక్షి, ముంబై:  టెనార్‌ (10. ఆర్‌) కొత్త  స్మార్ట్‌ఫోన్‌  వచ్చేసింది.   టెనార్‌ డి పేరుతో ఈ కొత్త డివైస్‌ను బడ్జెట్‌ధరలో విడుదల చేసింది. ముఖ్యంగా చైనామొబైల్‌ దిగ్గజం షావోమికి పోటీగా  హువాక్ఇన్ టెక్నాలజీ దీన్ని ప్రకటించింది. టెనార్‌ బ్రాండ్‌లో టెనార్‌ ఓ, టెనార్‌ జీఅందుబాటులోకి తెస్తున్న ఈ మూడవ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది.  రెడ్‌ మి 5ఏ పోలికలతో దీన్ని రూపొందించింది.   ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ కేవలం 0.2 సెకన్లలో అన్‌లాక్‌ అవుతుందని కంపెనీ పేర్కొంది.  రెండు వేరియంట్లలో  (2జీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, 3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌) లాంచ్‌ చేసిన  ఈ స్మార్ట్‌ఫోన్‌  ధరలు   వరుసగా రూ .3,999,  రూ .4,999 గా ఉండనున్నాయి.    కాగా జనవరి 6,2018నుంచి విక్రయానికి  లభ్యం.

టెనార్‌ డి ఫీచర్లు
5.5 అంగుళాల ఫుల్  హెచ్‌డీ డిస్‌ప్లే  
1.4GHz క్వాడ్-కోర్ ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్‌ 425 ప్రాసెసర్
 720x1280 పిక్సెల్‌ రిజల్యూషన్‌
13ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ  సెల్పీ కెమెరా,
4000 బ్యాటరీ  
 

>
మరిన్ని వార్తలు