జీఈఎస్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌ ఈ బుడతడు

28 Nov, 2017 15:21 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్: హైదరాబాదు హెచ్‌ఐసీసీలో జరుగుతున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌  సమ్మిట్‌లో హమీష్‌  ఫిన్లేసన్ (13) అతిచిన్న పారిశ్రామిక వేత్తగా క్రెడిట్‌ దక్కించుకున్నాడు.   7వ తరగతి చదువుతున్న  ఆస్ట్రేలియన్-ఆధారిత ఎంట్రపెన్యూర్‌  అతిచిన్న డెలిగేట్‌గా తన  ప్రత్యేకతను చాటనున్నారు.  గేమింగ్‌  అండ్‌ అవేర్‌నెస్‌పై  తాను రూపొందించిన యాప్‌లను ప్రదర్శించనున్నారు.

ముఖ్యంగా తాబేళ్లను రక్షించే ప్రాజెక్టులో ఇప్పటివరకు ఐదు యాప్‌లను హమీష్‌ అభివృద్ధి చేశాడు. ప్రస్తుతం ట్రాఫిక్ నియమాల గురించి అవగాహన  కల్పించేందుకు గాను ఆరవ యాప్‌ను పనిచేసే పనిలో  ఉన్నాడు. తాను  భారతదేశం రావడం చాలా సంతోషంగా ఉందని  ఫిన్లేసన్ తెలిపారు. టెక్నాలజీ అంటే తనకు ఎనలేని  ప్రేమ అని, యాప్‌లు..టెక్నాలజీ అదే ఫస్ట్‌ లవ్‌..అయినా చదువుమీద కూడా  దృష్టి పెడుతున్నట్టు  చెప్పాడు.  స్కూలు హోం వర్క్‌  పూర్తి చేసుకొని ఖాళీ సమయంలో మాత్రమే యాప్‌ల తయారీన పని  చూసుకుంటానన్నాడు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలను పరిష్కరించడానికి టెక్నాలజీద్వారా పని చేయాలని కోరుకుంటున్నాడని హమీష్‌ తండ్రి గ్రేమే చెప్పారు. దాదాపు 54దేశాలలో వినియోగ దారులను సంపాదించుకున్న హమీష్‌ జీఈఎస్‌-  2017 ద్వారా సముద్ర తాబేళ్ల, ఆటిజం ప్రభావం గురించి అవగాహన పెంచాలని కోరుకుంటున్నారని తెలిపారు.

కాగా భాగ్యనగరంలో మంగళవారంనుంచి మూడు రోజులపాటు జరగనున్న గ్లోబల్ ఎంట్రపెన్యూర్ షిప్ సమ్మిట్-2017మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు  అలాగే మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యతనిస్తున్న ఈ సమ్మిట్‌​కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ముఖ్య అతిధిగా  హాజరవుతున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు