నవంబర్‌లో నియామకాలు

17 Dec, 2016 01:46 IST|Sakshi
నవంబర్‌లో నియామకాలు

14 శాతం జంప్‌:  నౌకరి.కామ్‌ నివేదిక  
న్యూఢిల్లీ: నియామకాల జోరు కొనసాగుతోంది. నవంబర్‌ నెలలో నియామకాలు 14 శాతంమేర పెరిగాయని నౌకరి.కామ్‌ తన నివేదికలో తెలిపింది. దీనికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్, సాఫ్ట్‌వేర్‌సర్వీసెస్‌ వంటి రంగాలు కారణంగా నిలిచాయని పేర్కొంది. నివేదిక ప్రకారం.. ఈ ఏడాది నవంబర్‌లో నౌకరి జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ 1,817కు పెరిగింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇండెక్స్‌లో 14 శాతం వృద్ధి నమోదయ్యింది.

పట్ణణాల వారీగా చూస్తే.. పుణేలో నియామకాలు గరిష్టంగా 32 శాతంమేర పెరిగాయి. కొత్త సంవత్సరంలోనూ నియామకాల జోరు కొనసాగవచ్చు. వార్షిక ప్రాతిపాదికన చూస్తే.. బీఎఫ్‌ఎస్‌ఐ నియామకాలు 42 శాతంమేరపెరిగాయి. ఇన్సూరెన్స్‌ రంగంలో నియామకాలు 43 శాతంమేర ఎగశాయి. ఇక ఐటీ సాఫ్ట్‌వేర్‌/సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్, బీపీవో/ఐటీఈఎస్‌ రంగాల్లో నియామకాలు వరుసగా 14 శాతం, 15 శాతం పెరిగాయి. నియామకాల వృద్ధిమెడికల్‌/హెల్త్‌కేర్‌ రంగంలో 24 శాతంగా, టీచింగ్‌/ఎడ్యుకేషన్‌ విభాగంలో 35 శాతంగా ఉంది. పట్టణాల వారీగా నియామకాల వృద్దిని పరిశీలిస్తే.. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 12 శాతంగా, ముంబైలో 18 శాతంగా, బెంగళూరులో 20శాతంగా నమోదయ్యింది. అలాగే నియామకాలు చెన్నైలో 12 శాతం, హైదరాబాద్‌లో 9 శాతం, పుణేలో 32 శాతం పెరిగాయి.

మరిన్ని వార్తలు