విధివిధానాలపై 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ చర్చ

5 Dec, 2017 00:49 IST|Sakshi

న్యూఢిల్లీ: కొత్తగా ఏర్పాటయిన 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ మొట్టమొదటి సమావేశం సోమవారం ఇక్కడ జరిగింది.  కమిషన్‌ విధివిధానాలు తత్సంబంధ అంశాలపై తొలి సమావేశం చర్చించినట్లు ఆర్థికమంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ పంపిణీకి సంబంధించి అనుసరించాల్సిన విధానాల నివేదిక రూపకల్పన అంశంపై కమిషన్‌ ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు సమాచారం. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌కు ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు ఎన్‌కే సింగ్‌ నేతృత్వం వహిస్తున్నారు.  

2019 అక్టోబర్‌ నాటికి నివేదిక..: కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై జీఎస్‌టీ ప్రభావం సహా పలు అంశాలను 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ సమీక్షిస్తుంది. రుణ స్థాయిలు, నగదు నిల్వలు వంటి అంశాలను కమిషన్‌ సమీ క్షిస్తుంది. అక్టోబర్‌ 2019 నాటికి కమిషన్‌ తన నివేదికను సమర్పిస్తుంది.

మరిన్ని వార్తలు