169 స్టోర్లు మూత‌:వేల ఉద్యోగాలు గల్లంతు?

6 Sep, 2017 10:08 IST|Sakshi
169 స్టోర్లు మూత‌:వేల ఉద్యోగాలు గల్లంతు?

సాక్షి, న్యూఢిల్లీ:  ఉత్తర, దక్షిణ భారతదేశంలో  మెక్‌ డొనాల్డ్స్‌  స్టోర్లు భారీ ఎత్తున మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు లిమిటెడ్ (సీఆర్‌పీఎల్‌)తో ముగిసిన ఒప్పందం  నేపథ్యంలో మెక్‌ డొనాల్డ్స్‌ షాపులు ఈ రోజు(బుధవారం) నుంచి మూతపడ నున్నాయి.   దీంతో వేలాదిమంది ఉద్యోగులు ఉపాధి  కోల్పోనున్నారు.

 మెక్‌డోనాల్డ్స్‌  ప్రకారం  మొత్తం 169 దుకాణాల్లో   మెక్ డొనాల్డ్స్ ట్రేడ్‌ మార్క్‌   ఆహార ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోనున్నాయి.   సెప్టెంబరు 6 నుంచి తన బ్రాండ్ పేరు ,  ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించే అధికారం సీఆర్‌పీఎల్‌కు లేదని పేర్కొంది. రద్దు నోటీసు కాలం సెప్టెంబరు 5 న ముగిసినందున, మెక్డొనాల్డ్  మేధో సంపత్తిని ఉపయోగించేందుకు సీఆర్‌పీఎల్‌కు అధికారం లేదు. అంటే వారు మెక్డొనాల్డ్ పేర్లు, ట్రేడ్‌మార్క్‌ పేర్లు, డిజైన్లు, బ్రాండింగ్,  మార్కెటింగ్  లాంటివి ఉపయోగించడం మానివేయాలి. దీనికి సంబంధించి  చట్టపరమైన , ఒప్పంద హక్కుల ప్రకారం తాము వ్యవహరించనున్నామని మెక్డోనాల్డ్  ఇండియా ప్రతినిధి  చెప్పారు.
 
అయితే స్టోర్లమూసివేతపై సీఆర్‌పీఎల్‌  ఎలాంటి ప్రకటన  చేయలేదు. మరోవైపు బుధవారం నేషనల్ కంపెనీ లా  అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ను ఆ‍శ్రయించనున్నామని  కంపెనీ ఎండీ విక్రమ్ బక్షి చెప్పారు. ఈ  స్టోర్ల మూసివేత కారణంగా  వేలాదిమంది  ఉద్యోగులను రోడ్డుమీదికి నెట్టివేయనుందన్నారు.  అంతేకాదు ఇది తమ  వ్యాపారంపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని  విక్రమ్‌ బక్షి తెలిపారు.   దాదాపు 10 వేల మంది  (ప్రత్యక్షంగా ,పరోక్షంగా)తో పాటు కంపెనీ సరఫరాదారులు, ఇతర వ్యాపార భాగస్వాములకు తీవ్ర  నష్టం కలిగిస్తుందని చెప్పారు.  

కాగా  మెక్‌డొనాల్డ్‌తో ఫ్రాంఛైజ్ ఒప్పందం రద్దును  సవాలు చేస్తూ సీఆర్‌పీఎల్‌ పిటిషన్‌ను మంగళవారం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కొట్టివేసింది.  సీఆర్‌పీఎల్‌ మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ బక్షి  పిటిషన్‌ దాఖలు చేసిన  సంగతి తెలిసిందే

 

 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా