2 లక్షల పైన కంపెనీలపై ప్రభుత్వం వేటు

5 Sep, 2017 19:32 IST|Sakshi
2 లక్షల పైన కంపెనీలపై ప్రభుత్వం వేటు
సాక్షి, న్యూఢిల్లీ : షెల్‌ కంపెనీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. 2.09 లక్షలకు పైగా సంస్థలను ప్రభుత్వం డీరిజిస్టర్‌ చేసింది. రెగ్యులేటరీ నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు వీటిని డీరిజిస్టర్‌ చేస్తున్నట్టు మంగళవారం ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక ఆ కంపెనీల బ్యాంకు అకౌంట్లను నియంత్రిస్తూ చర్యలు కూడా ప్రారంభించింది. ఈ కంపెనీలు చట్టబద్ధంగా పునరుద్దరించబడే వరకు ఈ సంస్థల బ్యాంకు అకౌంట్లను ఆపరేట్‌ చేయడానికి వీలు లేదంటూ ప్రభుత్వం ఆదేశించింది. '' కంపెనీల యాక్ట్‌ సెక్షన్‌ 248(5) కింద 2,09,032 పేర్లను రిజిస్టర్‌ కంపెనీల నుంచి తొలగించాం. వీటి ప్రస్తుత డైరెక్టర్లు, అధికారిక సంతకాలు ఇక మాజీ డైరెక్టర్లు, మాజీ అధికారిక సంతకాలుగా మారాయి'' అని అధికారిక ప్రకటన వెలువడింది. 
 
కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న కంపెనీల చట్టం సెక్షన్‌ 248 ప్రకారం పలు కారణాలచే కంపెనీల పేర్లను రిజిస్టర్‌ జాబితా నుంచి తొలగించే అధికారం ఉందని ప్రభుత్వం తెలిపింది. నిలిపివేయబడినవి(స్ట్రక్‌ ఆఫ్‌) నుంచి యాక్టివ్‌లోకి వీటి స్టేటస్‌లోకి మారినప్పుడు మాత్రమే వీటిని చట్టబద్ధంగా మళ్లీ పునరుద్ధరించడం జరుగుతుందని చెప్పింది. నిలిపివేయబడ్డ ఈ కంపెనీల బ్యాంకు అకౌంట్ల ఆపరేషన్లను నియంత్రించే చర్యలు కూడా తీసుకోబడుతున్నాయని ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.
>
మరిన్ని వార్తలు