2 లక్షల ఇళ్లకు రేపే ముహుర్తం

8 Apr, 2017 15:06 IST|Sakshi
2 లక్షల ఇళ్లకు రేపే ముహుర్తం
అందరికీ ఇళ్లు అనే పథకం కింద రెండు లక్షల అందుబాటులోని గృహాలు రేపు లాంచ్ కాబోతున్నాయి. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో క్రెడాయ్ నిర్వహిస్తున్న అందుబాటులోని గృహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు చేపట్టబోతున్నారు. అందరికీ అందుబాటులో గృహాలు అందించాలనే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం తమ పదవిలోకి వచ్చినప్పటి నుంచి ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ డెవలపర్లు, వారి అసోసియేషన్లతో కలిసి ఈ పథకాన్ని చేపడుతోంది. అందుబాటులో గృహాలను ప్రమోట్ చేయడానికి కేంద్రప్రభుత్వం వివిధ రకాల చర్యలను కూడా చేపడుతోంది.
 
బడ్జెట్ లో చౌక గృహాల నిర్మాణానికి మౌలిక హోదా కూడా కల్పించింది.  2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం ముందుకెళుతుండటంతో, కనీసం చౌక గృహ నిర్మాణం వరకైనా మౌలిక హోదా ఇవ్వాలని స్థిరాస్తి సంఘాలు కోరడంతో బడ్జెట్ లో దీన్ని ప్రకటించింది. కాగ, అందుబాటులోని గృహాల గరిష్ట సైజు 643 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 900 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాకు సమానంగా ఉంటుంది. సిటీలు, ప్రాంతాల ఆధారంగా ఈ ప్రాజెక్టుల ధర రూ.12 లక్షల నుంచి రూ.35 లక్షలుగా ప్రకటించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలను కొనుగోలుదారులకు చేరేలా కృషిచేస్తామని క్రెడాయ్ పేర్కొంది. 
మరిన్ని వార్తలు