8 నిమిషాల చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు 

8 Sep, 2018 01:01 IST|Sakshi

వాహనాలకు ఫాస్ట్‌ చార్జింగ్‌ను ఆవిష్కరించిన ఏబీబీ

న్యూఢిల్లీ: ‘టెర్రా హెచ్‌పీ ఫాస్ట్‌ చార్జింగ్‌ సిస్టమ్‌’ను ఏబీబీ భారత మార్కెట్‌ కోసం ఆవిష్కరించింది. ఇందుకు ప్రపంచ రవాణా సదస్సు వేదికగా నిలిచింది. కేవలం 8 నిమిషాల చార్జింగ్‌తో ఓ కారు 200 కిలోమీటర్లు ప్రయాణించడం ఈ వ్యవస్థ ప్రత్యేకత అని కంపెనీ తెలిపింది. రవాణా వ్యవస్థను ఎలక్ట్రిక్‌ ఆధారితంగా మార్చే విషయంలో భారత ప్రభుత్వ ఆకాంక్షలు, చర్యల్ని ఏబీబీ సీఈవో ఉల్‌రిచ్‌ స్పీసోఫర్‌ ప్రశంసించారు. మూవ్‌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ... భారత్‌లో ఎలక్ట్రిక్‌ రవాణాకు ఏబీబీ తన టెక్నాలజీలతో సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.

‘‘కొన్ని నెలల క్రితం జర్మనీలో జరిగిన హానోవర్‌ ఇండస్ట్రీ ఫెయిర్‌లో నూతన టెర్రా హైపవర్‌ ఈవీ చార్జర్‌ను ఏబీబీ ఆవిష్కరించింది. ఇది ఎనిమిది నిమిషాల చార్జింగ్‌తో ఓ కారును 200 కిలోమీటర్ల మేర ప్రయాణించేలా చేయగలదు. ఈ తరహా ఫాస్ట్‌ చార్జర్‌ను ఈ కార్యక్రమానికి తీసుకురావడం జరిగిందని’’ స్పీసోఫర్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ బస్సుల రవాణాకు సంబంధించిన టెక్నాలజీలో లీడర్‌గా ఉన్నామని, టోసా సిస్టమ్‌ కేవలం 20 సెకండ్ల బరస్ట్‌తో ఓ బస్సు రోజంతా నడిచేలా చేయగలదన్నారు.    

>
మరిన్ని వార్తలు