-

2005 క్రితం కరెన్సీ నోట్ల మార్పునకు గడువు పొడిగింపు

24 Dec, 2015 02:53 IST|Sakshi
2005 క్రితం కరెన్సీ నోట్ల మార్పునకు గడువు పొడిగింపు

ముంబై: 2005 క్రితం నాటి రూ.500, రూ.1,000సహా పలు డినామినేషన్లలోని కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పొడిగించింది. ఈ ఏడాది చివరి వరకూ ఉన్న గడువును మరో ఆరు నెలలు 2016 జూన్ 30 వరకూ పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కేవలం గుర్తింపు పొందిన బ్యాంక్ బ్రాంచీలు, ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసుల్లో మాత్రమే బ్యాంక్ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జనవరితో ముగిసిన 13 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లో 164 కోట్లకుపైగా 2005 క్రితం నోట్లను  వ్యవస్థ నుంచి (చించివేత యంత్రం ద్వారా) తొలగించినట్లు పేర్కొన్నారు. వీటి విలువ దాదాపు రూ.21,750 కోట్లు.
 

మరిన్ని వార్తలు