‘ఆల్టో 800’.. కొత్త వేరియంట్లు

19 May, 2016 00:54 IST|Sakshi
‘ఆల్టో 800’.. కొత్త వేరియంట్లు

ధర రూ.2.55 లక్షల నుంచి
రూ.3.76 లక్షల రేంజ్‌లో
మైలేజీ పెట్రోల్ 24.7కిమీ.
సీఎన్‌జీ మోడల్‌లో 33.4 కిమీ.

 న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ కంపెనీ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బాక్ మోడల్ ఆల్టో 800లో అప్‌డేటెడ్ వేరియంట్‌లను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త ఆల్టో కార్ల ధర రూ.2.55 లక్షల నుంచి రూ.3.76 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)రేంజ్‌లో  ఉన్నాయని మారుతీ సుజుకీ తెలిపింది. తమ మోడళ్లన్నింటిలోనూ అత్యధికంగా అమ్ముడయ్యేది ఈ ఆల్టో మోడలేనని మారుతీ సుజుకీ ఇండియా ఈడీ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.ఎస్. కల్సి చెప్పారు.  ఈ తాజా వేరియంట్లలో వివిధ కొత్త ఫీచర్లను అందిస్తున్నామని పేర్కొన్నారు.

మైలేజీ లీటర్‌కు 24.7 కి.మీ. వస్తుం దని, ప్రస్తుతమున్న ఆల్టో మోడల్ కంటే ఈ కొత్త వేరియంట్ల మైలేజీ 9 శాతం అధికమని వివరించారు. సీఎన్‌జీ మోడల్ అయితే 33.4 కి.మీ. మైలేజీ వస్తుందని, ప్రస్తుతమున్న మోడల్ కంటే ఇది 10 శాతం అధికమని పేర్కొన్నారు. తాజా సాంకేతిక ఫీచర్లతో, అత్యున్నతమైన భద్రతాయుతమైన ఫీచర్లతో ఈ కొత్త వేరియంట్లను అందిస్తున్నామని కల్సి పేర్కొన్నారు. గత పన్నెండేళ్లుగా అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతీ మోడల్ ఇది. చరిత్రాత్మకమైన 30 లక్షల కార్ల విక్రయాల మైలురాయిని సాధించిన తొలి కార్ బ్రాండ్ కూడా ఇదే.

 కారు ప్రత్యేకతలు..
0.8 లీటర్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన ఈ కారులో 5-స్పీడ్ గేర్ బాక్స్, వెనక సీట్లకు హెడ్‌రెస్ట్స్, ప్యాసింజర్ సైడ్ ఓఆర్‌వీఎం, డ్రైవర్‌సైడ్ ఎయిర్‌బ్యాగ్(ఆప్షనల్-రూ.6,000 అదనంగా చెల్లించాలి), రియర్ స్పాయిలర్, ఫుల్ వీల్ కవర్స్, ముందువైపు పవర్ విండోలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, రిమోట్ కీలెస్ ఎంట్రీ,  వెనక వైపు సీట్లకు చైల్డ్ లాక్,   వెనక వైపు బాటిల్ పెట్టుకునే హోల్డర్,  కో -డ్రైవర్ సైడ్ మ్యాప్ ప్యాకెట్ తదితర ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది.

మరిన్ని వార్తలు